వ్రాసినది: సురేష్ | ఫిబ్రవరి 27, 2009

గురజాడ – ఆధునిక తెలుగు భాషా సాహిత్య యుగకర్త

చందమామ, బాలమిత్ర, రాజుల కథలు ఆ తరువాత మధుబాబు డిటెక్టివ్ నవలలు, ఇంకొంచము తరువాత యండమూరి రచనలు ఇట్లా సాగింది నా తెలుగు సాహిత్య(?) ప్రస్థానము. ఈ మద్యలో అప్పుడప్పుడు యద్దనపూడి నవలలు, ఏమి సుత్తిరా బాబు అనుకుంటూ చదివి తెలుగు సాహిత్యం ఇంతే అనుకునే రోజులు. దానికి తోడు తెలుగు పాఠ్యంశాలలో ఉండే గ్రాంధీకమైన భాషను చూసి ఇట్లాంటివి చదవడము మన వల్ల అయ్యే పని కాదు అని ఆ తరహా రచనల జోలికి వెళ్ళకుండా మానేయటము కూడా జరిగింది.

వేరే రాష్ట్రంలో విద్యనభ్యశించటానికి వెల్లినప్పుడు, తెలుగుకు మనము ఎంత తక్కువ ప్రాముఖ్యము ఇస్తామో (ముఖ్యముగ మన తమిళ సోదరులను చూశాక ) అర్ధమయ్యింది. ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి మన భాష గురించి అనే భావము కలిగింది. పదవ తరగతితో ఆగిపోయిన తెలుగు చదువు, గ్రాంధిక భాష అంటే ఉండే బెరుకును అట్లాగే మిగిలించినది.

ఆ సమయములో (kanpur లో) తెలుగు భాషాభిమానులైన కొందరు మిత్రులు దొరకటము నా అదృష్టము. మళ్లొకసారి తెలుగు వైపు చూడటము ఎందరో గొప్ప సాహితీకారులను గురించి తెలుసుకోవటము జరిగింది. నా మీద బాగా ప్రభావము చూపించిన రచ ఇతలు గురజాడ, శ్రీశ్రీ, రావిశాస్త్రి మరియు కొకు. ముఖ్యముగ నవయుగ సాహితీకర్త గురజాడ. గురజాడ ప్రాశస్త్యము గురించి శ్రీశ్రీగారు, “సుమారు వెయ్యేళ్ళు అవ్యాహతంగా సాగుతూ నలిగిన క్లాసికల్ బండిదారి నుంచి గురజాడ తెలుగు కవిత్వానికి ఒక కొత్త మలుపు ఇచ్చాడు. రథాలు, పల్లకీలు, గుర్రబ్బళ్ళూ వెళ్ళే దారిని తప్పించి, మోటారూ, రైలు బళ్ళూ తిరిగే ఆధునిక యుగానికి తెలుగు కవిత్వాన్ని మళ్ళించాదు. గురజాడ చూపించిన మలుపును నేను మరింత వెడల్పు చేశాను”.

అందువల్లే వీరిద్దరు నాకు అతి ప్రీతిపాత్రమైన రచ ఇతలు. తెలుగు భాషా సాహిత్యాలలో మార్పులు రెండు సార్లు వచ్చాయి. మొదటది ఆధికవి నన్నయ తెలుగును కావ్య భాషగా మార్చటము. దాని ప్రభావము ఆ తరువాత కొన్ని వందల పురాణాలు, ప్రభందాలు, స్తుతి స్తొత్రాలు ఇంకా ఎన్నొ రచనలు మహామహుల కలాలనుండి వెలువడ్డాయి. కానీ సామాన్య మానవునికి అందుబాటులోలేని ప్రాచీన కఠిన తెలుగు భాష మాత్రమే దీనికి వినియోగించటము జరిగింది. దానికితోడు ఇహలోక విషయాలు మరియు తార్కికము శాస్త్రీయమైన సంగతులు కావ్య వస్తువులుగా పనిచెయ్యవు అనుకొని వాటి జోలికి బొత్తిగా వెళ్ళలేదు. Industrial Revolution, Renaissance లాంటి ప్రక్రియలకు దూరముగ మన మేదస్సునంతా రాజులను పొగడడానికి, మాన్యాలను అందుకోవటానికి వెచ్చించటము జరిగింది. దానికి తోడు సాంఘీక అసమానతలు, సతీ కన్యాశుల్కము లాంటి దురాచారాలు, కులవ్యవస్థ.

ఈ నేపద్యములో తెలుగు భాష రెండో మార్పు గురజాడ కన్యశుల్కం నాటకముతో వచ్చింది. వాడుక భాష ఉత్తమ కావ్య భాష ఐనది; వాస్తవ జీవిత కథ కావ్యానికి వస్తువైనది. కాలము చెల్లిన ప్రాచీన కావ్య పద్దతులకు వీడ్కోలు పలికింది. శ్రీశ్రీలాంటి కొత్త తరం కవులకు మార్గదర్శకముగా నిలిచింది. కన్యాసుల్కం పక్కన పెడితే నాకు బాగా నచ్చిన గురజాడ కవితలు దేశభక్తి మరియు పూర్ణమ్మ. బహుశా ఈ రెండు కవితలు చిన్నప్పుడు చదవటము మూలముగనై ఉండవచ్చు.
దేశమును ప్రేమించుమన్నమంచీన్నది పెంచుమన్న
వట్టిమాటలు కట్టిపెట్టోయి గట్టిమేలు తలపెట్టవోయి
ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి
స్వంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవోయి
దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి
అన్నదమ్ముల వలను జాతులు మతములన్నియు మెలగవలెనోయి

ఏంత చక్కని కవిత? వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా ఎంత నిత్య నూతనముగ, సమయానుచితముగ ఉన్నది? కష్టపడి ఎన్ని ప్రభందాలు, పురాణాలు చదివితే ఈ అనుభూతి కలుగుతుంది? మన రాజకీయ నాయకులకు ప్రతిరోజు అస్సంబ్లీలో ఈ కవిత చదవటము తప్పనిసరీని ఒక నియమము పెదితే ఎంత బాగుండు?

ఇక పొతే పూర్ణమ్మ కవిత

మేలిమి బంగరు మెలతల్లార కలువుల కన్నుల కన్నెల్లార తల్లుల గన్నా పిల్లల్లార విన్నారమ్మా ఈ కథను?
పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
ఆటల పాటల తోటి కన్నియలు మొగుడు తాత అని కేలించె
నలుగురు కూచొని నవ్వే వేళల నన్నొక పరి తలవండి
కన్నుల కాంతులు కలువల చేరెను మేలిమి జేరెను మేని పసల్ హంసలు జేరెను నడకల బెడుగులు దుర్గను జేరెను పూర్ణమ్మ.
 

కన్యాశుల్క దురాచారము గూర్చి కఠినమనస్కులకు కూడా పరివర్తన కలిగేట్లు ఎంద వ్యధాభరితముగ వర్ణించారు? నేటి కాలములోని లంచగొండితనము, కుళ్ళు రాజకీయాలు కన్యాశుల్కం కంటే ఏమీ తీసిపోయేవి కావు? మరో గురజాడ మరో శ్రీశ్రీ రావాలి.

వ్రాసినది: సురేష్ | ఫిబ్రవరి 24, 2009

స్వాగతం

త్వరలో కలుసుకుందాము

« Newer Posts

వర్గాలు