వ్రాసినది: సురేష్ | మార్చి 12, 2009

మా అబ్బాయికి తెలుగు అస్సలు రాదు

“మీరు నమ్మరుగానీ మా అబ్బాయికి తెలుగు అస్సలు రాదండి” గర్వముగా చెప్పింది లక్ష్మి పక్కింటి సుజాతతో. మొన్నకి మొన్న మా అమెరికా చెల్లెలి పిల్లలు వస్తే వాళ్ళతో ఇంగ్లీషు తప్పితే తెలుగు ఒక్క ముక్క మాట్లాడితే వొట్టు. అదేంటో వొదినా ఆ పిల్లలు మాత్రము వీడితో ఎంతసేపూ వచ్చీ రాని తెలుగులోనే మాట్లడటానికి చూశారు.ఏంటో అమెరికా వెళ్ళినా కొన్ని కొన్ని పిచ్చి అలవాట్లు మాత్రము పోలేదు వాళ్ళకి.

ఈ తరహా సంభాషణలు నాకు ఊహ తెలిసినప్పటినుండీ వింటూనే ఉన్నాను. కానీ బాధాకరమైన విషయము ఏంటంటే, ఈ వింత పోకడ రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఆంగ్లేయులు దేశాన్ని వదిలి అరవయేళ్ళు పైబడినా, రెండు తరాలు గడిచినా, మనకు మట్టుకు అది ఇప్పటికీ గొప్ప భాషే…దొరలు మట్లాడే భాషే.

నా చిన్నప్పుడు, మా తాతగారు (కన్యాశుల్కం నాటకములో గిరీశములా), తెల్లవాడికి సంబందించినవన్నీ (భాషతో సహా) ఎంత గొప్పవో చెపుతూ ఉండేవారు. ఉదాహరణకి Londonనుంచి వచ్చే సిమెంటు (మన నాసిరకము దానిలా కాక) బస్తాళ్ళో ఉండగానే రాయిలా గెడ్డ కట్టుకుపోయేదంట. “అదేంటి తాతగారు సిమెంటుకు ఆ గుణము అస్సలు ఉండగూడదు కదా?” అని నేను అమయాకముగా అడిగితే ఆయన, “నీకేమీ తెలియదురా, నువ్వుండు ఈకాలపు చదువులే ఇంత మారోజులలో ఐతేనా..” అని ఇంకెక్కడికో వెళ్ళిపోయేవారు.

అంతదాకా ఎందుకు మన భాష గొప్పదనము గురించి ఒక తెల్లదొర చెప్పేవరకు మనము నమ్మామా? Telugu is the Italian of the East అని C.P.Brown చెప్పి రెండు శతాబ్దాలు గడిచాయి. మనమూ చక్కగా ఆ విషయము మర్చిపోయాము. అసలు గుర్తుంచుకోవటానికి మనకు అవకాశము ఉంటే గదా. మన పిల్లలు తెలుగు పుస్తకాలు చదువుతుంటే గద? (TVలు చూస్తూ అసలు పుస్తకాలే చదవటము లేదు అది వేరే సంగతి). ఆ టీవీలలో, సినీమాళ్ళో కూడా ఏరికోరి తెలుగు రానివాళ్ళు, వచ్చినా దానిని అంగ్ల ఉచ్చారణతో మట్లాడేవాళ్ళను మాత్రమే చూస్తున్నము.

ఈ విదముగా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉదాహరణలు.
దీనికి పరిష్కారము ఏమిటి?
మన భాష క్రమేణా ఇలా క్షీణించి పోవలసినదేనా?
నా పరిదిలో నేను ఏమి చెయ్యగలను?
ప్రభుత్వము ఏమి చెయ్యగలదు?

ఇంగ్లీషు నేర్చుకోవద్దు, ఇంగ్లీషులో మాట్లాడవద్దు అని కాదు ఇక్కడ భావము. In fact we should all learn and excel in English which is the default medium all around the world. దానికి తోడు కొంచెము మన భాష గురించి కూడా గొప్పగా చెప్పుకుందాము.

మరో టపాలో ఈ సమస్య పరిష్కారం గురించి చర్చిద్దాము. ఈలోపు మీ అభిప్రాయములు తెలుపగలరు.


స్పందనలు

  1. భావ వ్యక్తీకరణ మాతృభాషలో జరిగేలా చేయగలిగితే , తెలుగు పునర్జీవితమౌతుంది

    • మనోహర్ గారు చాలా చక్కగా చెప్పారు.

      నెనరులు
      సురెష్

  2. మీ బాధ అర్ధం చేసుకోవచ్చు సురేష్ గారూ… కాని, ఈ పరిస్తితుల్లో మనలాంటి వారిది అరణ్య రోదన అవుతుందే కాని ఎవరు వినిపించుకుంటున్నారు.. మరో మాట… బ్రౌన్ గారు తెలుగు గురించి చెప్పింది రెండు శతాబ్దాల క్రితం (200 సంవత్సరాలు) దశాబ్దాలు కాదు (ఒక దశాబ్దం = 10 సంవత్సరాలు) గమనించగలరు.

  3. మన తెలుగు బ్లాగులలో చాలా మంది బాధ పడే విషయమే ఇది. ఈ తెలుగు (etelugu.org) లో కుడా ఎక్కువగా ఇలాంటి విషయాల మీద చర్చ జరుగుతుంటుంది. చూసి అక్కడ మీ అభిప్రాయాలు కుడా చెప్పండి

  4. its time to feel shy for that .
    first of all we have to know the mother language after that
    english on anything else……..

  5. I got as far as title, that was about it.

    If I knew how to read this It would have been great – unfortunately I don’t.

  6. deeni thassa diya! emi cheppavura!karashte teluguku matladatamu thaggindhi ika chadavadam,rayatam…cheppodhu…nanduri,viswanatha sastri,chalam,gopichand..srisri…aathmalu goshistu vuntai..kalakramamlo…emi kolpothunnamo

  7. మీ బాధ అర్ధం చేసుకోవచ్చు సురేష్ గారూ… కాని, ఈ పరిస్తితుల్లో మనలాంటి వారిది అరణ్య రోదన అవుతుందే కాని ఎవరు వినిపించుకుంటున్నారు.. మరో మాట… బ్రౌన్ గారు తెలుగు గురించి చెప్పింది రెండు శతాబ్దాల క్రితం (200 సంవత్సరాలు) దశాబ్దాలు కాదు (ఒక దశాబ్దం = 10 సంవత్సరాలు) గమనించగలరు.

    +++++++++++++++++++++++++++++++++++

    అసలు ఈ బాధ ఏమిటి? దశమ గ్రహనికి శతమ గ్రహనికి ఈ ఫొలిక ఏమిటి?


వ్యాఖ్యానించండి

వర్గాలు