వ్రాసినది: సురేష్ | అక్టోబర్ 18, 2009

దిక్కెవరు

దిక్కెవరు

సకల చరాచర జీవ రాశులందు

మొదటి వరసలో ఏతెంచిన జల చరమును

అందమునకు ఎందరో మీనాక్షుల కనుల

సోయగమునకు పా్రమాణికను

వేదాలు రక్షింపగ ఆ దేవదేవుడే మెచ్చి

ఆది అవతారముగ ధరించిన రూపమును..

అయితేయే..

పరిణామక్రమమున పిదప వచ్చి

నిలబడి గూడ నిలకడ లేని నిర్దయ జీవి

నీటి యందు మునిగి నిమిషమైన తిన్నగ

నిలువలేని సాగలేని మనలేని అల్ప జీవి

తన వంతుగ పైవాడిచ్చిన వనరులతో

తృప్తి పడక అంతా తనదేననే దురాశా జీవి

అన్నదమ్ములు అక్కచెల్లెలు తో కూడి

ప్రశాంతవాసము సాగించెడి నా గూటిలో

మోతలు చేయు మర పడవలు తిప్పుటయె గాక

నిర్లక్ష్యముగ నీటి ఉపరితలమున ఊపిర సలపకుండ

చమురు చిందించెడి సంకుచిత జీవి

అపరిమితమైన తనయాకలి తీర్చుకొను నెపమున

నా సహజ వాసములైన చెరువులను భూములుగ జేసి

వాగులు, సెలయేరులకు అడ్డుకట్టలు వేసి

నాకు నిలువ నీడ లేకుండ జేసిన దురాక్రమణ జీవి

ఎవరిచ్చారు తనకీ అధికారము?

తన విలాసములకు, కారులలో తిరుగుటకు

గాలిలో ఎగురుటకు, ఒకరి నొకరు నరుక్కొనుటకు,

తినుటకు, తిన్నది అరుగుటకు

రకరకాల యంత్రాలు, కర్మాగారాలు.

వాటినుంచి వచ్చు మలినములు

నా ఇంటిలో గుమ్మరించి నా గొంతు నొక్కి

నాకు ఊపిర అందకుండ జేసిన కర్కశ జీవి

భూగోళము వేడెక్కినదట, నీటి మట్టము పెరిగినదట

అంటార్కిటికా మంచు కరిగితే వచ్చిన నీరు కాదది

మౌన రోదనముల దారలుగ కారి కారి

కనిపించకనే ఉప్పు నీట కలిసినట్టి నా కన్నీరు

బాధగ నిట్టూర్పు విడుచుటకు ఉచ్ఛా్వసము తీయలేను

భక్తితో జోడింతు మన్న అయ్యో చేతులైన లేవు

ధ్యానింతు మన్న కను రెప్పలు కూడ ఈయగ నైతివి

మనిషిని మించిన నిర్దయుడవు కదా

ఓ మీనావతారా, ఇంకెవరు దిక్కు నాకు?



స్పందనలు

  1. సురేష్ గారు, చాలా సంతోషమండి, ఈ కవితా విలాపం అందించినందుకు…
    “తన వంతుగ పైవాడిచ్చిన వనరులతో

    తృప్తి పడక అంతా తనదేననే దురాశా జీవి”

    మనిషి నైజం కి ప్రతీకలివి.

    “భక్తితో జోడింతు మన్న అయ్యో చేతులైన లేవు

    ధ్యానింతు మన్న కను రెప్పలు కూడ ఈయగ నైతివి”

    ప్చ్ హృదయవిదారకంగా అనిపించింది.

    అసలు అనుకోని సంకల్పం ఇది. దీపావళికి ముగిద్దామనే కానీ అది హార్డ్ స్టాప్ కాదు. ఇది కాక మరో మూడు రచనలు అందాయి. తప్పక పి.డి.యఫ్ కి కలుపుతాను.

    ఈ స్పందన అనూహ్యం అత్యంత ఆనందం. మనమంతా తప్పక మరో ప్రయత్నం లో మళ్ళీ కలవాలి. నవ సాహితీ పోకడలకి శ్రీకారం చుట్టాలి.

  2. Dear Suresh, nice presentation, I think you are not late . you did it now.
    with cardial Deepaawali greetings…..Nutakki

  3. చాలా బాగుందండి.

  4. DEAR SURU,
    GOOD PRESENTATION.HAPPY DEEPAWALI.

  5. Awesome, Suresh! Chaala nacchindi!! Though I didn’t understand the entire poem, I got the most of it and it’s amazing you express your thoughts so well..and kudos to you for having such wonderful thoughts.

    The blog picture is beautiful..reminds me of my childhood days when I used to visit my village..how I long for them?

    keep writing,
    Sunil

  6. @చిలమకూరు విజయమొహన్ గారూ, @ఉష గారూ, @సునీల్, @ప్రసాద్ ధన్యవాదములు.

    @రాఘవేంద్రగారూ, మనిద్దరి కవితలు ఈ topic లో సమాంతరముగ వెళ్లాయి. Great minds think alike :-).

    • మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను…కీపిటప్….నూతక్కి రాఘవేంద్ర రావు.

  7. left a sad feeling since I’m also a cause (indirectly) for it…

  8. Good one

    Keep writing

  9. good flow.

    బాగుంది.

  10. Dear Suresh Garu,
    Excellent poem,rather kavitha.Mee saily chaala baagundi.Mukhyamga kavithalo ardrata,inka cheppalante delicacy baagundi.Meeru inta sunnitamga,sunisitamga untaarani anukolem.Meeru inka enno vishayala meeda rasi manchi award ponde roju kosam eduru choostoo,

    Lathaprasad.

  11. సురేష్,

    కవిత చాలా బాగుంది!

  12. Suresh,

    ABSOLUTELY Fantastic. Came by your site via my friend Vijay.

    Cheers,

    – Venu

  13. Blog site chala bagundi. kavitha heart touching ga undih. Nee sahityabhiruchiki johar.

  14. kavitvamu bagundi. improved in typing quality also. Keep writing more and more on varous topics like this.


వ్యాఖ్యానించండి

వర్గాలు