వ్రాసినది: సురేష్ | అక్టోబర్ 26, 2009

తానా, ఆటా సంఘాలకో విజ్ఞప్తి

తానా, ఆటా సంఘాలకో విజ్ఞప్తి

డాలస్ లో వైభవంగా టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సు.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్  అనబంధ తెలుగు సాహిత్య వేదిక 23వ సాహితీ సదస్సును నెల నెల తెలుగు వెన్నెలకార్యక్రమంతో మిళితం చేసి నిర్వహించారు. సుమారు 100 మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు..  ”

ఆంధ్రజ్యోతి article కు లంకె

ఇది ఆంధ్ర జ్యోతి దినపత్రికలో మొన్న ప్రచురితమైన ఓకానొక వార్త లోని మొదటి కొన్ని వాక్యములు. ఇండియాలో ఈ news  itemచదివే వారికి, ఆహా ప్రవాసాంధ్రులకు సాహిత్యము అంటే ఎంత అభిమానము అనుకునేట్టుగా ఉంది. “ఎవరో గోపిచంద్ అంట (ఏరా నీకు తెలుసా ఎవరో?), తన శత జయంతి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చెశారంట”, అని కూడా అనుకోవచ్చు. ఆ మేరకు ఈ కార్యక్రమము తన ఆశయము సాధించినదనే చెప్పాలి. దానిని నిర్వహించిన నా మిత్రుని కూడా ఎప్పటిలా అభినందించాలి (ఆంధ్రజ్యోతి కధనములో అతని పేరు మిస్ అయ్యింది, అది వేరే సంగతి).

కానీ ఇంకా లోతుగా విశ్లేషిస్తే మరో కోణము బయటపడుతుంది. ఈ కార్యక్రమము జరగటానికి ముందు రోజు, ఇదే డాలస్ లో, మరో ప్రోగ్రాము జరిగినది. 1500 మంది హాజరయ్యారు. మహా వైభవముగ వేడుకలు జరిగాయి. మహిళలకు తమ తమ latest fashion డ్రస్సులు, పట్టు చీరలు ప్రదర్శించే అవకాశము దొరికింది. ఎప్పటిలాగే, ABCDపిల్లలకు మరో boring దేశీ ప్రోగ్రాము  చూడక తప్పింది కాదు. మగ వారికి, వాళ్లకు సంబంధించిన గొప్పలు (సొల్లు) చెప్పుకునే అవకాశము captive audience ద్వారా చిక్కినది. అందరూ హాపీసు..

అదేంటో మరుసటి రోజు జరిగిన ఈ సాహితీ కార్యక్రమానికి మాత్రము అందులో పట్టు మని పదో వంతు మంది కూడా రాలేదు. నా అంచనా ప్రకారము  ఇరవై ముప్పై మంది కూడా హాజరై చూసి ఉండరు. మొదటి programకి అంత ఎక్కువ మంది ఆసక్తి గా  ఎందుకు వచ్చారో నేను చెప్పాల్సిన అవసరము లేదనుకుంట. మీరు ఊహించే ఉంటారు. మొన్నామధ్య డాలాస్ లో, అవధానము సందర్భముగ, రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు మన సినిమా సంస్కృతి మీద, అశువుగ అద్భుతమైన satirical పద్యమొకటి చెపితే దానికి  retortగా  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమా పరిశ్రమ ఏ విధముగ సాహిత్యానికి మేలు చేసిందో  చక్కగా వివరించారు. నాకు అప్పుడు తట్టలేదు గాని ఇప్పుడు బాగా బోధ పడింది. శాస్త్రి గారన్నట్లు, ఇక్కడ problemసినీ పరిశ్రమ మూలాన గాదు.

శ్రీశ్రీ కొకు గోపిచంద్ శత జయంతి ఉత్సవాలు, కేతు విశ్వనాధరెడ్డి గారి ఉపన్యాసము, చక్కటి విందుభోజనము, అద్భుతమైన ambience (upscale OMNI downtown hotel), అంతా ఉచితము; అయినా అటెండెన్స్ అంతంత మాత్రము. మనందరము కలిసి తప్పకుండా ఆలోచించ వలసిన విషయమిది. ఎన్నో సంవత్సరాల అనుభవమున్న గౌరవనీయులైన పెద్దలలో ఒకరు, program  success గురించి పొగుడుతూ, “OMNI లాంటి పాష్ లొకేషనులో ఇది జరగటము వలన నా చిరకాల వాంఛ తీరినది, దీనిని సాధ్యపరిచినందుకు తానా నిర్వహనాధికారులకు కృతజ్ఞతలుఅని రాయడము నాకు చాలా ఆశ్చర్యము కలిగించింది. అంటే మన expectationsమరీ అంత అడుగంటాయా? ఎలాంటి లొకేషనులో జరిగింది, యే యే పేవర్లలో, ఎవరెవరి పేరులతో వార్తలు పడింది అనేదే సాహితీ సదస్సు సఫలమవటానికి కొలమానమా?

ఆర్గనైజర్లను కించ పరచటము నా అభిమతము ఎంత మాత్రముగాదు. వారు కార్యక్రమము చాలా చక్కగా నిర్వహించారు. దిగితేనే గాని లోతు తెలియదని, ఒడ్డున నుంచెని ఎన్ని విషయాలైనా సుళువుగా చెప్ప వచ్చనిగూడా తెలుసు. అలా అని మరింత మెరుగు పడే మార్గాలు, ఆలోచనలు ఉన్నా discuss చెయ్యకపోవటము ఎంత మాత్రము అభిలషణీయము కాదు. ఉదాహరణకు కొన్ని:

విశాలాంధ్ర బుక్ హౌస్ లో, మహా ప్రస్ధానం పుస్తకము వెల,  50/- . 100 పుస్తకాల వెల షుమారు $100. మనమెందుకు శ్రీశ్రీ శతజయంతి సంధర్భముగ ఉచితముగా ఇవ్వ లేక పోయాము? Look at how Christian missionaries distribute Bible for free. తీసుకున్న వాళ్లలో కొంత మందన్నా చదవక పోతారా అన్న ఆలోచన. ఈ విధముగ Indiaలో ఎంతో కొంత మందికి జీవనోపాధి కలిగించినట్టు గూడాఉండేది. I would be more than happy to contribute to this sort of thing than to buy one book of Sri Sri (సిప్రాలి) for  an unreasonable price. నా మిత్రునికి, కొకు గొప్పతనము తెలుసు, కాని ఎప్పుడూ కొని చదివే అవకాశము రాలేదు. అతను, తన లాంటి వాళ్లు చాలా మంది తప్పకుండా కొని్న పుస్తకాలు సరసమైన ధరలకు ఉంటే కొనే వారు. ఉచితము అయితే మరీ మంచిది. Instead our organizations are sponsoring ordinary books about movie personalities with prices that are inflated many fold  (like $40 for an autobiography of a famous actor and poet at one of the recent events). ఏమి సాధించాలనుకుంటున్నాము?

పెద్ద ఊరులో, ఎన్నో వనరులు గల TANA, TANTEX లాంటి successful organizations నడుమ, ఇంత మంది ఆశకి్త గల అభిమానులున్నా, ఒక తెలుగు libraryకూడా లేక పోవటము తప్పకుండా లోటే. మనకున్న ఒక అనుకూలమైన విషయము, డాలరు కొనుగోల శక్తి. ఎన్నో గొప్ప పుస్తకాలు, సరైన పద్దతిలో కొంటే చాలా తక్కువ దరలకు పొందవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితము, IIT Kanpur లో, నేను ఒక మిత్రుడు కలిసి, చక్కని libraryని చాలా తక్కువ కాపిటల్ తో వృద్ధిచేసి, నిర్వహించాము. మాలాంటి వాళ్లు చేయగలిగినప్పుడు, తెలుగు organizationకి అంత కష్టము కాకపోవచ్చు.

తెలుగు వచ్చిన మన పరిస్ధితే ఇలా ఉంటే మన పిల్లల timeకి ఎలా ఉంటుందో సులభముగ ఊహించవచ్చు. సిలికానాంధ్ర వారి మన బడిఒక చక్కని ప్రయత్నము. అదే పని ATA, TANA, TANTEX వారు, మరింత grand scaleలో ఎందుకు చేయలేక పోతున్నారు? తప్పకుండా వారు ఆలోచించవలసిన విషయము.

ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉచిత సలహాలు ఇవ్వవచ్చు. నాకు మట్టుకు “Telugu Cultural and Language Glass is half empty”. మీరేమంటారు?



స్పందనలు

  1. ayya,

    mIru spandincina tIru baagundi. kaani, manabadi gurinci tana, ata lu munduku raavaalani maatram adagakanDi. appudu adi kulaala manabadi avutundi tappa ‘manabadi’ avadu. ayitE oka manci jarugutundi.

    $300 caduvu $100 kE vastundi (freegaa vaddu sumaa!). free caduvulu entO kaalam naDavavu.

  2. Taana, Aataa vaallu vintaru anukuntunnara? meedi bhale joke andee.

  3. TANTEX నిజం గా వుందా ?

  4. Telugu Association of North TEXas 🙂

  5. baaga cheppaaru. telugu gurinchi mee tapana, ichchina salahaalu bavunnaayi.. TANA varu alochistarani aasistunna.

  6. ముందుగా మీరు ఇచ్చినవి మంచి సలహాలు.
    మీరు ఇవ్వాల్సింది సలహా TANTEX వారికి గాని, TANA, ATA లకు కాదు, ఎందుకంటే Dallas లో స్థానిక తెలుగు సమాఖ్య TANTEX కాబట్టి.
    ఇక TANA, ATA లు ఈ మధ్యన ఎగబడి ఇంతకముందు లేనట్లు కలసి పనులు (కొన్ని అయినా) ఎందుకు చేస్తున్నాయి అంటే రెండూ ఈ మధ్య కాలంలో ముండ మోసాయి కాబట్టి (sorry for my language). దాని అర్ధం ఏమిటి అంటే TANA నుండి NATS విడిపోవటం వలన “విధవ” అయితే, ATA నుండి NATA విడిపోవటం వలన “వెధవ” అయ్యింది కాబట్టి, విధవ కు, వెధవ తోడు కావాలి కాబట్టి రెండూ కలసి వాళ్లకు వాళ్ల సొంత బలం Dallas లో లేకపోవటం వలన TANTEX తో కలసి ఎవో కొన్ని పనులు చేస్తున్నఆరు కాని ఆ రెండు కుల సంస్థల వెనక పోవటం వలన TANTEX కు దెబ్బ అని అందులోని వాళ్లె గొణగటం మీకు వినిపించిందో లెదో కాని నా వరకు వినిపించింది.
    ఇక తెలుగువెలుగు గురించి దాని గురించి వక్తలు గొప్పగా చెప్పుకోవటం గురించి, రెండు సంవత్సరాల క్రితం వరకూ ఇలాంటి కారక్రమాలు అసలు జరిగేవి కాదు, ఆ రకంగా ప్రతినెల ఇలాంటి కార్యక్రమం క్రమం తప్పకుండా చేయటం గొప్పే తప్పకుండా గతం తో పోలిస్తే. అందుకు గాను ఆ కార్యక్రమ నిర్వాహకులకు credit ఇవ్వాల్సిందే.
    ఇక మీరు చెప్పిన సలహాల తో పాటు నా సలహాలు అయితే TANTEX వారికి,
    1. ఇండియా నుండి పెద బాలశిక్ష లనుండి, షాడో నవలల వరకూ వీలయితే తెప్పించి plano library తొనో, irving library system తొనో mutual understanding తో తెలుగు వారందరికీ అందుబాటులోకి పుస్తకాలు అందించవచ్చు.
    2. summer లో తెలుగు camps (మన బడి) లాగానే కాకపోతే intense నిర్వహించవచ్చు. పాఠాలు చెప్పటానికి ఎటు వందలలో ప్రతి సంవత్సరం visiting కు వస్తున్న ఇక్కడి వారి తల్లి తండ్రులను, ఇంట్లోనే ఉండి పిల్లలను చూస్కొనే గౄహిణి ల services వాడుకోవచ్చు, దానికి మైత్రి, వనితా వేదికలు ఉపయోగపడవచ్చు. 3. ఒక్క భాషే కాకుండా సంస్కృతి కోసం, summer లో కాని, ప్రతి వారాంతం కాని సంగీతం, ఆంధ్రనాట్యం లాంటి మన కళల classes పెట్టవచ్చు. ప్రస్తుతం ఇవి నేర్చుకోవాలంటే ఊర్లో కూచిపూడి, కర్ణాటక సంగీతం నేర్పే ఒకరిద్దరి దయా దాక్షిణ్యాల మీదే పిల్లలు ఆధారపడాల్సి వస్తుంది. తల్లి తండ్రులకు నేర్పించాలని ఉన్నా నేర్పే ఒకరిద్దరి ప్రవర్తన వలన మరియు వాళ్ల commercial మెంటాలిటీ లతో (One can not blame them either, after all this is a capitalist country of the world) విసుగు వచ్చి అపేయించుతున్న వాళ్లు చాలా మంది.
    చేగిరెడ్డి భాస్కరెడ్డి లాంటి గుండా గాళ్లను sponsor చేసి తీసుకొచ్చే బదులు చక్కగా, ఆంధ్రా నుండి పేద కళాకారులను sponsor చేసి TANTEX తెప్పించి ఇక్కడ పిల్లలకు ఎంతో కొంత fees తీసుకొనే నేర్పించవచ్చు.
    చివరగా మీరు అన్నట్లు “ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉచిత సలహాలు ఇవ్వవచ్చు” నా కామెంట్ మీ టపా కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నా 

    • Krishnaగారూ, మీ సలహాలు బాగున్నాయి. ముఖ్యముగ local libraryతో co-ordinate చెయ్యటము అనే అంశము.

  7. ento mee chadastam kaka pothe akkada mana telugu rastramlo theluge pothondi. evariana matladuthe adi thelugu urduna thamilama edo assalu aa bhasho theliyatla. Inka schools lo thelugu porapatuna edo thelugu matladane tahpana unna students matlduthe vallani chava badi shiskashulu. mari akkada vidyarangam emi chesthondo thelliyadu. idi paristithi akkada. tv9 lo ninna chupichina di evarina chusthe thelustundi nenu emi antunna. aa Tv chanlso chudali tv9 thappa migathivi theulugu asalu bagundadu. maa tv thelugu good.

    • ఆకాశరామన్నగారూ, మీ ఆక్రోశములో ఏమీ తప్పులేదు. అంధ్ర దేశములో ఇవాళ పరిస్థితి అలాగే ఉంది.

  8. టపా చదివి స్పందనలు పంపిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదములు. మీ స్పందన post చేసి ఉండకపోతే క్షమించగలరు

  9. your observations and complaints are right on!
    Some of these points have been discussed on verious forums connected to Telugu literature in the US, some progress has been made.
    1. Over the last 10 years, I know at least half a dozen local literary groups meeting regularly – independent of local or national telugu association – this was not there before.
    2. TANA contributes to Telugu literature through fin assistance to annual katha series and a couple of other initiatives.
    3. Several individuals and smaller groups are actively sponsoring publication and re-publication of valuable texts.
    4. Local public libraries in several US cities now store Telugu books.
    5. Visalandhra, being the largest publishing and distribution house in AP, has its own idiosyncrasies – doing business with it is not as simple as buying a few books. they hold the rights on Mahaprasthanam.

    • కొత్తపాళీ గారూ నా బ్లాగుకు వచ్చి వ్యాఖ్య నిచ్చినందుకు ధన్యవాదములు. ఈ టపా రాసి చాలా రోజులయినది. ఈ మధ్య కాలములో, డాలస్ లోనే TANTEX కి అనుబంధ సంస్ధగా ఓ లైబ్రరీ ఏర్పరిచే ప్రయత్నము లో ఉన్నాము.


వ్యాఖ్యానించండి

వర్గాలు