వ్రాసినది: సురేష్ | ఫిబ్రవరి 12, 2010

డాలస్ లో స్నో శివరాత్రి



ఎప్పుడూ లేనిది మా వూరిలో ఇవాళ స్నో ఇరగ దీసింది. షుమారు ఒక అడుగు పడి ఉండొచ్చు అంటున్నారు. మంచు తో కప్పబడి   తెల్లగా, అందముగా ఉన్న భూమిని చూస్తుంటే ఈ చిన్న పద్యము వచ్చింది..


వాహనము, సహవాసము, వాసము, కురు
లనెల వంక, మైపూత తెల్లగ మెరిసెడి
ధవళ ప్రియునీ శివరాత్రి నాడు గొలువ
ధవళ వస్త్రము గట్టెను ధరణి మాత


స్పందనలు

  1. adi gAMdi pArklO teesina phOTO na?

    • అది Irving లో తీసిన ఫొటో కాదండి. మా ఇంటి దగ్గరలోది.

  2. అవునుట, రేడియోలో విన్నాను


వ్యాఖ్యానించండి

వర్గాలు